![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -109 లో.....మహాని పిల్లలు ఆడే ప్లేస్ కి తీసుకొని వచ్చి సరదాగా ఆడుకోమని చెప్తాడు. చక్రి. ఇక చక్రి సరదాగా పరుగెడుతూ కిందపడిపోతాడు. మహా చెయ్ ఇవ్వబోతు తనపై పడ్డట్టు ఉహించుకుంటాడు కానీ తన చెయ్ పట్టుకొని లాగింది నారాయణ. తనని చూసి చక్రి షాక్ అవుతాడు. ఇక మహా నవ్వుకుంటుంది. మరొకవైపు హారిక తన పాపని ఆడుకోమని చెప్పి లోపలికి వెళ్తుంది.
మరొకవైపు అటువైపుగా బాల్ వెళ్తే పాప వెళ్తుంది. ఆ బాల్ మహా దగ్గరికి వెళ్తుంది.. పాపని చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు మాకు దూరంగా ఎందుకు వెళ్లిపోయావ్.. నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా నీ బెడ్ రూమ్ కి వెళ్తున్నానని పాప అంటుంది. మరొకవైపు హారిక వాళ్ళ అత్తయ్య లలిత దగ్గరికి వెళ్తుంది. అలా సరదాగా బయటకు వెళదామని పిలిచానని లలిత అంటుంది. పదండి అత్తయ్య అని హారిక అంటుంది. హారిక వచ్చేసరికి మహాతో మాట్లాడుతుంది పాప. మహాని అక్కడ చూసి వాళ్లు షాక్ అవుతారు. ఎలా ఉన్నావ్ మహా అని లలిత అడుగుతుంది. కొంపలు ముంచేవాళ్ళు ఎలా ఉంటారని లలిత కోప్పడుతుంది. ఆ తర్వాత మహాకి వాళ్ళ నాన్న ఎదురుపడతాడు. నాన్న అని మహా పిలుస్తుంది. ఎలా పిలవాలనిపిస్తుందని లలిత కోప్పడుతుంది.
ఆ తర్వాత మహాని తిట్టారని చక్రి వాళ్ళకి తెలిసి ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారని అనుకుంటారు. మరొకవైపు ఆది రెసాట్ ఓనర్ కి ఫోన్ చేస్తాడు. ఆ చక్రి ఫ్యామిలీని ఎవడురా రానిచ్చిందని ఆది కోప్పడతాడు. ఆ తర్వాత ప్రతాప్ డ్రింక్ చేస్తాడు.. అటుగా నారాయణ వెళ్తుంటే ప్రతాప్ పిలుస్తాడు. ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. ఈ రోజు నా కూతురు కన్పించిందని చెప్తాడు. తరువాయి భాగంలో రెసాట్ నుండి మహా వాళ్ళని పంపించాలని ఆది ప్లాన్ చేస్తాడు. ఒక గేమ్ పెడతారు. ఒకవైపు మహా వాళ్ళు.. ఇంకొకవైపు ప్రతాప్ వాళ్ళుంటారు.. ఎవరు ఓడిపోతే వాళ్ళు రెసాట్ నుండి వెళ్ళిపోవాలని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |